కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌ వ్యహారం మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. ఓవైపు భారత్ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపి.. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని స్పష్టం చేయగా.. మరోవైపు కశ్మీర్ వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది పాక్. అయితే, కశ్మీర్‌పై ఎండీఎంకే చీఫ్ వైగో సంచలన వ్యాఖ్య చేశారు. భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి కశ్మీర్‌.. భారత్‌లో ఉండదని వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన వైగో.. కశ్మీర్‌పై బీజేపీ బురదజల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌పై గతంలో కూడా నా అభిప్రాయం చెప్పా.. కశ్మీర్‌పై కాంగ్రెస్‌ 30 శాతం తప్పుచేస్తే.. బీజేపీ 70 శాతం తప్పుచేస్తోందన్నారు.