మహిళా క్రికెట్‌లో నయా రికార్డు...! 12 పరుగులు 10 వికెట్లు..

మహిళా క్రికెట్‌లో నయా రికార్డు...! 12 పరుగులు 10 వికెట్లు..

బీసీసీఐ అండర్‌-19 మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. చండీగఢ్‌ అమ్మాయి కశ్వి గౌతమ్‌ అద్భుతం చేసింది. ఏకంగా పది వికె​ట్లు పడగొట్టి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. కశ్వి.. 4.5 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు తీసింది. దీంతో ఆమె ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేసింది. 10 వికెట్లలో హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేసింది కశ్వి. ఈ యంగ్‌ మహిళా బౌలర్‌ విజృంభణతో చండీగఢ్‌ 161 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. బౌలింగ్‌లో 10 వికెట్లతో సత్తా చాటిన కశ్వి.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. 49 పరుగులతో రాణించింది. ఆమె బ్యాటింగ్‌ జోరుతో చండీగఢ్‌ టీమ్‌ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

ఇక, తర్వాత బ్యాటింగ్‌ దిగిన అరుణాచల్‌ప్రదేశ్‌ కేవలం 8.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిది మంది డకౌట్‌ అయ్యారు. 29 బంతుల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ జట్టును పెవిలియన్‌కు పంపింది కశ్వి. ఇందులో ఆరు ఎల్బీడబ్ల్యూలు, నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విజృంభించిన కశ్వి గౌతమ్‌ తన జట్టుకు ఒంటిచేత్తో భారీ విజయాన్ని అందించింది.