మెక్సికోలో పెద్ద పార్టీ ఇవ్వనున్న హీరోయిన్

మెక్సికోలో పెద్ద పార్టీ ఇవ్వనున్న హీరోయిన్

తరచూ విదేశాల్లో చక్కర్లు కొట్టే బాలీవుడ్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ కూడా ఒకరు.  ఎప్పుడు గ్యాప్ దొరికినా విమానం ఎక్కి విదేశాలకు చెక్కేస్తుంటుంది ఈమె.  ఇటీవలే ఆమె నటించిన 'భారత్' చిత్రం పెద్ద హిట్టవడం, పైగా రేపు 16వ తేదీన తన పుట్టినరోజు కావడంతో మెక్సికోలో పెద్ద పార్టీ ఆరెంజ్ చేసింది కత్రినా.  ఈ పార్టీకి ఆమె స్నేహితులు చాలామంది హాజరుకానున్నారు.