సల్మాన్ కు కత్రినా కైఫ్ ప్రపోజల్

సల్మాన్ కు కత్రినా కైఫ్ ప్రపోజల్

సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న భారత్ సినిమా కు సంబంధించిన ఓ వీడియోను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  చాలా ఫన్నీగా ఉండే సీన్ అది.  కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ కు ప్రపోజల్ చేస్తుంది.  పెళ్లి వయసు వచ్చింది ఇంకెప్పుడు చేసుకుంటావు అని కత్రినా అడిగితె అవును అని సల్మాన్ సమాధానం ఇస్తాడు.  నువ్వు చూడటానికి చాలా బాగుంటావు అని అంటే... ధన్యవాదాలు అని జవాబిస్తాడు.  నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితె.. సల్మాన్ చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంటుంది.  

ఈ ప్రపోజల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.  20 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల వయసువరకు సల్మాన్ ఖాన్ వివిధ రకాల గెటప్స్ లో కనిపించి అలరిస్తారని తెలుస్తోంది.  రంజాన్ సందర్భంగా జూన్ 5 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.