ఈ వీడియోలో కత్రినా కష్టం కనిపిస్తోంది !

ఈ వీడియోలో కత్రినా కష్టం కనిపిస్తోంది !

నవంబర్ 8వ తేదీన విడుదలకానున్న బాలీవుడ్ భారీ చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'.  ఈ సినిమాలో స్టార్ నటి కత్రిన కైఫ్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది.  ఇటీవలే ఆ పాటకు సంబందించిన వీడియో కూడ విడుదలైంది.  స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన కత్రిన ఈ పాటలో కూడ మూమెంట్స్ అదరగొట్టింది.  

ఈ మూమెంట్స్ అంత ఖచితంగా, అందంగా చేయడానికి ఆమె చాలానే కష్టపడింది.  ప్రభుదేవ పర్యవేక్షణలో ఎన్నో గంటలు రిహార్సల్స్ చేసింది.  ఈ రిహార్సల్స్ వీడియోనే ఆమె ఇన్స్టాగ్రమ్ ద్వారా చేస్తూ ప్రభుదేవ స్టైల్ ను పట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది.