అందాల బందిపోటు.. ట్విట్టర్ లో వైరల్

అందాల బందిపోటు.. ట్విట్టర్ లో వైరల్

బాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  అమీర్ ఖాన్,  అమితాబ్  బచ్చన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో  కత్రినా కైఫ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నది.  కత్రినాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  బంగారం పోత పోసినట్టుగా ఉన్న రూపుతో ఆకట్టుకుంది.  వెనుక జిగేల్ జిగేల్ అనిపించే  లైటింగ్స్ తో అదరహో అనిపించింది.  

ఇప్పుడు ఈ సురయ్యా జాన్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది.  అమీర్ ఖాన్ సైతం ఈ ఫోటోపై కామెంట్ చేశారు.  ధూమ్ 3 సమయంలోనే ఆమెపై మనసు పారేసుకున్నాను.  చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా ఉన్నా.  ఈ విషయాన్ని ఎవరైనా ఆమెకు చెప్తే నామీద దయ చూపినవారౌతారు" అని ట్వీట్ చేశారు.