రాముడిపై కామెంట్స్..కత్తి మహేష్ అరెస్ట్..!

 రాముడిపై కామెంట్స్..కత్తి మహేష్ అరెస్ట్..!

సినీ నటుడు మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో "రాముడు కరోనా ప్రియుడు" అంటూ పోస్ట్ చేయడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతడిపై Ipc section 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. ఇదిలా ఉండగా గతంలో కూడా రాముడిపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. కత్తి మహేష్ నటుడు, దర్శకుడిగా కంటే వివాదాల తోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తరవాత పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేయడంతో అతడి ఫ్యాన్స్ తో సైతం వివాదాలు తలెత్తాయి. ఇక కత్తి మహేష్ దర్శకుడిగా మిణుగురులు చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించాడు.