‘భారత ఆర్మీ.. ఎల్లప్పుడూ సిద్ధమే..’

‘భారత ఆర్మీ.. ఎల్లప్పుడూ సిద్ధమే..’

నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసిన అనంతరం భారత ఆర్మీ అధికారిక ట్విటర్‌లో ఓ పద్యాన్ని పోస్ట్‌ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్‌ధారీ సింగ్‌ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ (అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్)‌ భారత ఆర్మీ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఓ శత్రువు ముందు నువ్వు నిజాయతీగా ఉంటే.. అది నీ చేతకాని తనం అనుకుంటాడు. కౌరవులు పాండవులను చిన్నచూపు చూసినట్లు.. మనం మంచి స్థాయిలో ఉండి.. గెలిచే సత్తా ఉంటేనే శాంతి చేకూరుతుంది’ అని పేర్కొంది. ఈ పోస్ట్‌కు ‘భారత ఆర్మీ.. ఎల్లప్పుడూ సిద్ధమే..’ అన్న హ్యాష్‌ట్యాగ్స్‌ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే 30వేల మంది లైక్స్‌, 14 వేల మందికి పైగా రీట్వీట్లు చేశారు.