మెగాస్టార్ చేతుల మీదుగా కౌసల్య కృష్ణమూర్తి టీజర్

మెగాస్టార్ చేతుల మీదుగా కౌసల్య కృష్ణమూర్తి టీజర్

స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ మూవీస్ కు మంచి ఆదరణ లభిస్తున్నది.  స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన జెర్సీ హిట్టైన సంగతి తెలిసిందే.  కాగా ఇదే జానర్లో మరో సినిమా రాబోతున్నది.  అదే కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్.  భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మెగాస్టార్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది.  

ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది.  క్రికెట్ అంటే ప్రాణంగా భావించే ఓ అమ్మాయి.. తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది.. వాటి నుంచి ఎలా బయటపడింది అనే వాటిని బేస్ చేసుకొని మూవీని తెరకెక్కించారు.