రివ్యూ: కవచం

రివ్యూ: కవచం

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ 

సంగీతం : థమన్ 

ఫోటోగ్రఫీ : ఛోటా కె నాయుడు  

నిర్మాత : నవీన్ చౌదరి 

దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ళ 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం  'కవచం'.  ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.  మరి ట్రైలర్లో ఉన్న దమ్ము సినిమాలో ఉందా లేదా నేది ఇప్పుడు చూద్దాం.. 

కథ 

విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.  అతను సంయుక్త (కాజల్)ను  ప్రేమిస్తాడు.  ఆమెను పెళ్లి చేసుకోవాలనే లోపే  మెహ్రీన్ కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాడు విజయ్.  ఆ సమస్య నుండి అతను బయటపడేలోపే మెహ్రీన్ హత్యకు గురవుతుంది.  ఆ కేసుకు సంయుక్తకు కూడ లింక్ ఉంటుంది.  దీంతో విజయ్ మీద హత్య కేసు కూడ పడుతుంది.  ఈ కేసు నుండి అతను ఎలా బయటపడ్డాడు, అసలు హత్యకు, సంయుక్తకు లింక్ ఏంటి అన్నదే సినిమా కథ.  

విశ్లేషణ : 

సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన పోలీస్ పాత్ర బాగుంది.  ఆ పాత్రను దర్శకుడు చాలా ఇంటెన్సిటీతో డిజైన్ చేశాడు.  శ్రీనివాస్ కూడ ఆ పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించాడు.  ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంది.  దర్శకుడు కథను సెట్ చేసియాన్ పోలీస్ బ్యాక్ డ్రాప్ కూడ బాగుంది.  సినిమా విజువల్స్ బాగున్నాయి.  ఛోటా కె నాయుడు ప్రతి ఫ్రేమును అందంగా చూపించాడు.  సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.  దర్శకుడు ఆసక్తికరమైన పోలీస్ ప్లాట్  తీసుకున్నా, అక్కడక్కడా మంచి ట్విస్టులు పెట్టినా మొత్తంగా సినిమాను ఆసక్తికరంగా నడిపించే కథనాన్ని రాసుకోవడంలో విఫలమయ్యారు.  

నటీనటుల పనితీరు : 

ముందుగా చెప్పుకున్నారు బెల్లఁమకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో మంచి ఇంటెన్సిటీతో నటించి ఆకట్టుకోగా కాజల్ అగర్వాల్ పాటల్లో మాత్రమే అందంగా కనిపించింది.  మిగతా సినిమా మొతం కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కనిపించింది.  ఇక కథలో కూడ ఆమె పాత్రకు పెద్గగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆమెకు పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ కూడ దక్కలేదు.  మెహ్రీన్ కు మంచి పాత్ర దొరకడంతో బాగానే నటించింది.  ప్రతినాయకుడి పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ బాగానే ఆకట్టుకున్నాడు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.  పోరాట సన్నివేశాల్ని బాగా చిత్రీకరించారు.  సినిమా విజువల్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి.  ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీయే అందుకు కారణం.  థమన్ పాటల సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా ఆయనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  దర్శకుడు శ్రీనివాస్ విషయానికొస్తే అతను సినిమా కోసం మంచి ప్లేట్ తీసుకున్నా దాన్ని ఆకట్టుకునే విధంగా నడిపించడంలో అంతగా సఫలం కాలేదు.  ఎడిటింగ్ బాగానే ఉంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

బెల్లంకొండ శ్రీనివాస్ నటన 

మంచి విజువల్స్ 

నెగెటివ్ పాయింట్స్ : 

మొదటి అర్థ భాగం 

బోరింగ్ కథనం 

ఆకట్టుకోని కథ 

చివరిగా : ఒక్కసారే చూడగలం