బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ 

బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ 

బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలోని కోరుట్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. బీజేపీ అబద్ధాలాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పారదోలేంత వరకు దేశం అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. తెలంగాణలో మైనారిటీలకు జరిగిన సంక్షేమం దేశంలో ఎక్కడా జరగట్లేదని అన్నారు. బీడీ కార్మికులకు, ఇతర వర్గాలకు తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఎక్కడా లేవని వివరించారు. దుబాయ్‌ చిన్న నగరమే అయినా అభివృద్ధిలో చాలా ముందుందని, భారత్‌ మాత్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో 48 లక్షల పెన్షన్‌దారులు ఉంటే 6 లక్షల మందికి మాత్రమే కేంద్రం పెన్షన్‌ ఇస్తోందని తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిపించినందుకు తన శాయశక్తులా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. ప్రజల అభీష్టం మేరకు పని చేశాననిపిస్తే కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని ప్రజలను కవిత అభ్యర్థించారు.