అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌.. ఇప్పుడు బండి సంజయ్‌ కామెడీ షో

అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌.. ఇప్పుడు బండి సంజయ్‌ కామెడీ షో

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. ఈ ఎన్నికలకు ఏకంగా కేంద్రమంత్రులు, సీఎంలు, మాజీలనే బీజేపీ పార్టీ రంగంలోకి దించింది. బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా అన్ని పన్నాగాలు చేస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌కు చేరుకుంది. డిసెంబర్‌ 1వ తేదీన పోలింగ్‌ జరగనుండగా... అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌.. ఇప్పుడు బండి సంజయ్‌ కామెడీ షో  చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ పేరు మారిస్తే ఏమొస్తుంది? అని ప్రశ్నించారు. పేరు మార్చడం కాదు... పరిపాలన విధానం మార్చుకోవాలని సూచించారు కవిత. ఈ సారి గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సెంచరీ కొట్టడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా.. బండ్ల గణేశ్‌ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తాను కామెడీ మ్యాన్‌ కాదని.. తానను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు.