స్పోర్ట్స్ బైక్‌ కోసం చూసేవారికి గుడ్ న్యూస్...

స్పోర్ట్స్ బైక్‌ కోసం చూసేవారికి గుడ్ న్యూస్...

100 సీసీ, 120 సీసీ బైక్‌లు నడపడం నేటి యువతకు చాలా బోర్... రోడ్‌పై ఏదైనా స్పోర్ట్స్ బైక్‌ వెళ్తుంటే వారి మనస్సు మొత్తం... రెండు కళ్లు ఆ బైక్‌పైనే ఉంటాయి. యువత మాత్రమే కాదు... నేటి అంకుల్స్‌ది కూడా అదే తీరు. అయితే వీటి ధరలు అందుబాటులో ఉండకపోవడంతో కొంత వెనుకడుగు వేస్తుంటారు. కానీ, దేశంలో స్పోర్ట్స్‌ బైక్ కోసం ఎదురుచూసే ఔత్సాహికులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది కవాసకి... భారీ ధర తగ్గింపుతో జపాన్ బేస్‌డ్ కంపెనీ చవకగా రూ. లక్షకే కవాసకి నింజా పేరుతో 300 సీసీ బైక్ తీసుకొస్తోంది. 

ఆటోకార్పై నివేదిక ప్రకారం... 300 సీసీ సెగ్మెంట్లో ఇతర బైకులకు ధీటుగా భారత్‌లో విస్తృతంగా అందుబాటులోకి తేవాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 300 సీసీ సామర్థ్యం కలిగిన కేటీఎం ఆర్సీ 390, అపాచీ ఆర్ఆర్ 310కు గట్టి పోటీఇవ్వనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కవాసకి నింజా 300 సీసీ ధర ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.6 లక్షలు ఉండగా... స్థానికంగా రూ.2.6కు తగ్గించే అవకాశం ఉంది. అయితే 300 సీసీ సెగ్మెంట్‌లో తక్కువ ధరలో ఈ బైక్‌ అందుబాటులోకి రానుంది. కవాసకి నింజా 300లో 296 సీసీ సామరథ్యం, ఆరు స్పీడ్ ట్రాన్స్మిషన్‌, స్లిప్పర్ క్లచ్‌తో పాటు ప్యార్లర్ ట్విన్ ఇంజిన్... పెట్రోల్ ఇంజిన్... గంటకు 182 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఇవే ఈ బైక్‌పై పాజిటివ్‌ టాక్‌ కలిగిస్తాయని భావిస్తున్నారు.