దసరా నాటికి అన్నీ రెడీ కావాలి - కేసీఆర్

దసరా నాటికి అన్నీ రెడీ కావాలి - కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ పార్టీ కార్యాలయాల్ని నిర్మించాలని తెరాస నిర్ణయించిన సంగతి తెలిసిందే.  ఏ మేరకు భూమిని, నిధుల్ని కూడా మంజూరు చేశారు.  ఈ విషయమై ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ చర్చించారు.

దసరానాటికి అన్ని భవనాల నిర్మాణాలు పూర్తికావాలని అంటూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి బాధ్యతలు తీసుకున్నవారికి చెక్కులు అందజేశారు.  ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును, నిర్మాణ ప్రణాళికను అందజేశారు.  నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు కేసీఆర్‌ సూచించారు.  రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు గురించి మాట్లాడిన ఆయన వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్నారు.