అధికారులపై కేసీఆర్‌ సీరియస్‌

అధికారులపై కేసీఆర్‌ సీరియస్‌

నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్‌ వాసులు పడ్డ ట్రాఫిక్‌ కష్టాల వ్యవహారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులపై సీరియస్‌ అయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతమవకూడదని స్పష్టం చేశారు. పోలీస్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాలతో సైబరాబాద్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎసీ కమిషనర్‌లు ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల వల్ల తరచూ ముంపునకు గురువతున్నా ప్రాంతాలు, ట్రాఫిక్‌జామ్‌ అవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. నిన్న కురిసిన వర్షానికి ఐటీ కారిడార్‌ మొత్తం జామ్‌ అవడంతో సైబర్‌ టవర్స్‌, కొండాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపుపై చర్చించారు.