మధురై మీనాక్షి సన్నిధిలో కేసీఆర్

మధురై మీనాక్షి సన్నిధిలో కేసీఆర్

తమిళనాడులో తెలంగాణ సీఎం పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం మధురైలోని మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.