కేంద్ర మంత్రి ఇంట్లో పెళ్లి సందడి, హజరైన సీఎం కేసీఆర్

కేంద్ర మంత్రి ఇంట్లో పెళ్లి సందడి, హజరైన సీఎం కేసీఆర్

కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు  హజరయ్యారు. ఈరోజు ఎర్రబెల్లిలో రెండో రోజు యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ సాయంత్రం నేరుగా హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి వివాహవేడుకలకు హజరైన అనంతరం తిరిగి రాత్రికి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీలో ఆయన వెంట ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, వినోద్, బండ ప్రకాశ్ ఉన్నారు.