అసద్ ఇంట్లో పెళ్లి సందడి.. హజరైన కేసీఆర్

అసద్ ఇంట్లో పెళ్లి సందడి.. హజరైన కేసీఆర్

హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ సీఎం హజరయ్యారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ త్రీ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీలు కవిత, సంతోష్ కుమార్, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, పోచారం శ్రీనివాస రెడ్డి తదితరులు హజరయ్యారు. 

అసద్ పెద్ద కుమార్తె ఖుద్సియా ఒవైసీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవాబ్ షా ఆలంఖాన్ మనవడు, నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ కుమారుడు నవాబ్ బర్కత్ ఆలం ఖాన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అసదుద్దీన్ ఇంట్లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఏదో సాధారణంగా జరిపించారనుకుంటే పొరపాటే. ముస్లిం సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో జరిగిన అతిపెద్ద వివాహ వేడుకగా నిలిచిపోయేలా అసద్ కుటుంబం ఏర్పాట్లు చేసింది.