కెసిఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ అదిరింది..

కెసిఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ అదిరింది..

కెసిఆర్  జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఉద్యమ సింహం.  తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన విషయాల గురించి ఈ సినిమా ఉండబోతున్నది.  ఇందులో కెసిఆర్  పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.  కెసిఆర్ గెటప్ లో నాజర్ సరిగ్గా సరిపోయారు.  

ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్నది.  నవంబర్ 16 వ తేదీన ఉద్యమ సింహం పాటలు రిలీజ్ కానున్నాయి.  వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.  కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు.  సినిమా గురించిన మిగతా వివరాలను ఆడియో వేడుక సమయంలో తెలియజేస్తారని సమాచారం.