సమ్మె చేస్తామంటే చేసుకోమనండి: కేసీఆర్‌

సమ్మె చేస్తామంటే చేసుకోమనండి: కేసీఆర్‌

ఆర్టీసీ ఉద్యోగుల బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బుధవారం రాత్రి ప్రగతి భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే ఎవరూ ఆపరని అన్నారు. వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా కార్మికులకు బెనిఫిట్స్‌ ప్రకటిస్తే..ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అన్నారు. వార్షిక నష్టాలున్నప్పుడు సమ్మె చేస్తామంటున్నారని.. చేస్తే చేసుకోమనండి అని కేసీఆర్‌ అన్నారు.