మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

 మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ మల్కజ్ గిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసనసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కనకారెడ్డి 2014-18 మధ్య మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. కాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిమ్స్ కు వెళ్లి కనకారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించనున్నారు.