టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక..

టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలో తిరుగులేని మెజార్టీలో గెలిపించిన గులాబీ దళపతి కె.చంద్రశేఖర్‌రావును టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు... తెలంగాణ భవన్ లో ఇవాళ జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేలు హాజరై... కేసీఆర్‌ను టీఆర్ఎస్‌ ఎల్పీ నేతగా ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. ఇక ఏకగ్రీవ తీర్మానంపై పార్టీ ఎల్పీ నేతగా కేసీఆర్ సంతకం పెట్టి... ఆ ప్రతిని గవర్నర్ నరసింహన్‌కు పంపించారు. అనంతరం మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ తరఫున సీఎంగా కేసీఆర్‌ను గవర్నర్ ఆహ్వానించనుండగా... దీని తర్వాత గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.