ఆర్టీసీతో చర్చలకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ - నేడే చర్చలు 

ఆర్టీసీతో చర్చలకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ - నేడే చర్చలు 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత 22 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేది లేదని, ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని గతంలో పేర్కొన్నారు.  అటు హైకోర్టు కూడా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశాలు జారీచేసిన ససేమిరా అన్న కెసిఆర్, హుజూర్ నగర్ ఫలితం తరువాత రూటు మార్చారు.  

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపబోతున్నారు. ఈడీల కమిటీతోనే కార్మికులు చర్చలు జరపబోతున్నారు.  ఆర్ధికంగా భారంకానీ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  కానీ, కార్మికులు మాత్రం మెయిన్ డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది కార్మికుల డిమాండ్.  మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి చర్చలు జారుతాయో చూద్దాం.