అర్చకుల సంక్షేమానికి కేసీఆర్ చర్యలు

అర్చకుల సంక్షేమానికి కేసీఆర్ చర్యలు

తెలంగాణ ఉద్యమంలో అర్చకులు కూడా కీలక పాత్ర పోషించారని, స్వరాష్ట్రంలో వారికి కూడా కేసీఆర్ సర్కారు తప్పకుండా న్యాయం చేస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ కు అర్చకుల పట్ల ఎనలేని గౌరవం ఉందని, వారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజులలో తిరుపతి లాగే యాదాద్రిని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు కేటాయించిందని కడియం చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఈనాం భూములకు సంబంధించిన మెమో ఇచ్చిందని, అదే విధంగా తెలంగాణలో కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. వరంగల్లోని రాజరాజేశ్వరీ దేవాలయంలో జరిగిన తెలంగాణ అర్చక సమాఖ్య సమావేశంలో కడియం పాల్గొన్నారు.