త్వరలోనే దేశం ఆశ్చర్యపడే విషయం చెప్తాం - కేసీఆర్ 

త్వరలోనే దేశం ఆశ్చర్యపడే విషయం చెప్తాం - కేసీఆర్ 

ఈరోజు తెలంగాణలో కొండపోచమ్మ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.  అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.  తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ఓ ఉజ్వల ఘట్టం అని అన్నారు. భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనిది.. శిరస్సు  వంచి నమస్కరిస్తున్నాను. భూ నిర్వాసితులు  పిల్లలు కు ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లలో ఉద్యోగాలు ఇస్తాము, వారి పట్ల సానుభూతి ఉందని అన్నారు. 

మల్టీ స్టేజి లిఫ్టింగ్ చాలా కష్టం. ఏ ప్రభుత్వం ఇంతా త్వరగా పూర్తి చేయలేదు. లక్ష కోట్ల పంటను తెలంగాణ రైతులు ఒక ఏడాది లో పండించనున్నారని కేసీఆర్ తెలిపారు. దేశం లో 63 శాతం పంటను తెలంగాణ సప్లై చేస్తుంది. వలస కూలీలు ను ప్రత్యేక రైలు లో పంపించాము. 48 డిగ్రీల ఎండలో పని చేసిన వలస కూలీలు ఈ ప్రాజెక్ట్ లో పని చేసారు.. వారికి కృతజ్ఞతలు అని కేసీఆర్ తెలిపారు. గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్ట్ లు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. ఇక తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు. దేశం ఆశ్చర్యపడే విషయం చెప్తాం అని కేసీఆర్ తెలిపారు.  ఆ అద్భుతం ఏంటి అన్నది మరో వారంలోనే అందరికి చెప్తామని, అప్పటి వరకు సస్పెన్స్ లోనే ఉండాలని అన్నారు.