రాజ్‌భవన్‌కు కేసీఆర్‌.. కారణం ఇదేనా..?

రాజ్‌భవన్‌కు కేసీఆర్‌.. కారణం ఇదేనా..?

ఇవాళ శాసనసభ వాయిదా పడిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహన్‌ సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ నరసింహన్‌ను కేసీఆర్ కలవడం  ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లు ఇటీవల పలుమార్లు చర్చించారు. ఈ చర్చల అనంతరం విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన అంశాల పురోగతిని నరసింహన్‌కు కేసీఆర్‌ వివరించినట్టు తెలిసింది.