స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ..

స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని స్టాలిన్‌ నివాసంలో ఈ సమావేవం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వీరు చర్చించినట్టు తెలిసింది. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్‌కుమార్‌, సంతోష్‌కుమార్ ఉన్నారు. అంతకముందు ఇవాళ ఉదయం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఫెడరల్ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌.. ఇటీవలే కేరళ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు.