దళిత పెద్దలను కేసీఆర్ ఏనాడూ గౌరవించలేదు

దళిత పెద్దలను కేసీఆర్ ఏనాడూ గౌరవించలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. దళిత మహానుభావుల జయంతులకు, వర్ధంతులకు ఏనాడూ నివాళులు అర్పించలేదని మాదిగ దండోరా అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క దళితుడు ఓటు వేయబోతున్నాడని, వచ్చే ఎన్నికల్లో దామోదరను గెలిపించుకొని దళితుల సత్తా చాటుతామన్నారు. గడీల కోట నుండి పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దేశంలోనే లేరని, ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. యావత్ దళిత జాతిని అవమానించేలా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన మాజీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టుకు టీఆర్ఎస్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.