దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన కేసీఆర్

దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన కేసీఆర్

బెజవాడ కనకదుర్గమ్మకు ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమర్పించారు. కొద్ది సేపటి క్రితం కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు  దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, దుర్గగుడి ఈవో పద్మ స్వాగతం పలికారు. ముక్కుపుడక సమర్పించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ఉన్న ఈ ముక్కుపుడకను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఈ ముక్కు పుడక బరువు 11.29 గ్రాములు. అంతకముందు ముఖ్యమంత్రికి దేవస్థానం మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికింది.