గిరీష్ కర్నాడ్ మృతికి సంతాపం తెలిపిన కెసిఆర్

గిరీష్ కర్నాడ్ మృతికి  సంతాపం తెలిపిన కెసిఆర్

ఈరోజు దేశం ఇద్దరు ప్రముఖ నటులను కోల్పోయింది.  అందులో ఒకరు నాటక రచయిత, నటుడు,    జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ కాగా రెండో వ్యక్తి తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు, డైలాగ్ రైటర్ క్రేజీ మోహన్.  గత కొన్ని రోజులుగా గిరీష్ కర్నాడ్ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  ఈ ఉదయం అయన తుది శ్వాస విడిచారు.  

గిరీష్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు.  "దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన ఆయన సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలుగాంచాయని సీఎం కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు." కెసిఆర్.