హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటనను ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్ చేరుకున్నారు.ఈ నెల 6న కుటుంబ సభ్యులతో కలిసి కేరళకు వెళ్లిన కేసీఆర్‌ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో సమావేశమయ్యారు.  కోవలంలో రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. నిన్న రామేశ్వరంలో పర్యటించిన కేసీఆర్‌.. ఇవాళ మధురైలో మీనాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు ఇవాళ సాయంత్రం చేరుకున్నారు.