విజయవాడలో కేసీఆర్‌కు ఘనస్వాగతం

విజయవాడలో కేసీఆర్‌కు ఘనస్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. కేసీఆర్‌కు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు.  ఇవాళ మధ్యాహ్నం 1.45కు కనకదుర్గ అమ్మవారిని కేసీఆర్‌ దర్శించుకుంటారు. అక్కడి నుంచి 2.15కి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌   నివాసానికి వెళ్తారు. అక్కడే లంచ్‌ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇద్దరు సీఎంలూ పాల్గొంటారు.