ఇంటర్‌ ఫలితాల వివాదంపై కేసీఆర్‌ సమీక్ష 

ఇంటర్‌ ఫలితాల వివాదంపై కేసీఆర్‌ సమీక్ష 

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, విద్యాశాఖ కార‍్యదర్శి జనార్దన్‌ రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌లు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సమవేశంలో కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇవాళ సాయంత్రం తమ నివేదికను అందజేయనుంది.