గుణాత్మక పాలనకు 3 విధానాలు: కేసీఆర్‌

గుణాత్మక పాలనకు 3 విధానాలు: కేసీఆర్‌

రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు మూడు విధానాలను అనుసరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. రాష్ట్ర గ్రామీణ, పట్టణ, రెవెన్యూ పాలసీలను పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు. కొత్త పురపాలక చట్టంపై ఉన్నతాధికారులతో ఇవాళ ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల నుంచి ఉపశమనం లభించే రీతిలో రూరల్ (గ్రామీణ) విధానం, లంచాలు ఇచ్చే అవసరం రాకుండా వుండే విధంగా రెవెన్యూ విధానం, జీరో స్థాయికి అవినీతి చేరుకునే విధంగా అర్బన్ (పట్టణ) విధానం వుండాలని అన్నారు. 

సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేశామన్న ఆయన.. పెద్ద సమస్యలైన మంచినీరు, సాగునీరు, విద్యుత్‌ సమస్యను అధిగమించామని గుర్తుచేశారు. గ్రామాల్లో మూడు నెలల్లో మంచి మార్పు చూడబోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇక.. నూతన మునిసిపల్ చట్టం మీద అవగాహన కలిగించడానికి మునిసిపల్ కమిషనర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి  సూచించారు.