ఆ కుటుంబానికి కేసీఆర్ సారీ చెప్పాలి

ఆ కుటుంబానికి కేసీఆర్ సారీ చెప్పాలి

భర్త ఫొటోను మార్చి పరాయి వ్యక్తిని ఆమె భుజంపై చెయ్యి వేసినట్టుగా ప్రచురించడం మహిళను కించపరచడమే అవుతుందని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. జరిగిన తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారో కేసీఆరే చెప్పాలన్నారు. యాడ్ ఏజెన్సీ మీద చర్యలతో చేతులు దులుపుకుంటే సరిపోదని, వెంటనే ఆ కుటుంబానికి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారికి మూడెకరాల భూమి కేటాయించాలని డిమాండ్  చేశారు. కేసీఆర్ తన ప్రచారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని ఈ ప్రకటనతో అర్థమౌతుందన్నారు.