సీనియర్ దర్శకుడి ఇంటికి కెసిఆర్...!!
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే విశ్వనాధ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడపుడు మాత్రమేబయటకు వస్తున్న కె విశ్వనాధ్ ను ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కెసిఆర్.. దర్శకుడు విశ్వనాధ్ ఇంటికి వెళ్లి అయన ఆరోగ్యం గురించి తెలుసుకోబోతున్నారు.
దర్శకుడు కే విశ్వనాధ్ కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, స్వాతిముత్యం , సాగరసంగమం, సిరిసిరిమువ్వ, స్వయంకృషి వంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. దర్శకుడిగా మాత్రమే కాకుండా శుభసనకల్పం సినిమాతో నటుడిగా కూడా మారారు. చాలా సినిమాల్లో అయన నటుడిగా మెప్పించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)