టీవీ చర్చలకు వెళ్తే సస్పెన్షన్‌ వేటే..!

టీవీ చర్చలకు వెళ్తే సస్పెన్షన్‌ వేటే..!

టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు... వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను వెంటనే పూర్తి చేస్తామని, ఎన్నికలన్నీ పూర్తయితే అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టొచ్చని తెలిపారు. ఇక, టీవీ మీడియాలో చర్చలకు వెళ్లే నేతలను హెచ్చరించారు కేసీఆర్... టీవీ మీడియాలో చర్చలకు ఇకపై టీఆర్ఎస్ తరఫున ఎవరూ వెళ్లవద్దని, ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వెంటనే సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.