పొరపాటున బీజేపీతో కలసి పనిచేసాం...

పొరపాటున బీజేపీతో కలసి పనిచేసాం...

పొరపాటున బీజేపీతో కలసి పనిచేసాం అని టీడీపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ రోజు ఆయన కర్నూల్ జిల్లాలో మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబును చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు. 25 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రధాని పదవి పోతుందని మోడీ భయపడుతున్నారన్నారు. పొరపాటున బీజేపీతో కలసి పనిచేసాం.. రాష్ట్రానికి ఏదో చేస్తారని ఆశించాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదని తెలిపారు. టీడీపీ బలంతో బీజేపీ 3 స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలవమనండి అని సవాల్ విసిరారు. ఈసారి ఏపీలో బీజేపీ పోటీ చేయడం కూడా అనుమానమే అని అన్నారు.