టీడీపీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు...

టీడీపీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు...

వైసీపీ నేతలు టీడీపీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు అని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. బుధవారం ఆయన కర్నూల్ లో మీడియాతో మాట్లాడుతూ... ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం చంద్రబాబుకి రావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అలాంటి గొప్ప విషయంలో కూడా వైసీపీ నేతలు మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాబు ఉపన్యాన్యాసం జీర్ణించుకోలేకపోతున్నారు. డోన్ ఎమ్మెల్యే అన్ని నాకే తెలుసు అనే భావనతో మాట్లాడటం మంచిది కాదన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న మీరు ప్రజల సొమ్ము తింటున్నారని కృష్ణమూర్తి విమర్శించారు. సహచర ఎమ్మెల్యేను మావోలు హత్య చేస్తే జగన్ పరామర్శించడానికి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కి కానీ ఆయన ఎమ్యెల్యేలకు కానీ కేంద్రాన్ని, మోడీని ప్రశ్నించే దమ్ము లేదు.. వైసీపీకి అధికారం కట్టబెడితే తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతారన్నారు. అన్న ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు అని కృష్ణమూర్తి తెలిపారు.