'నా వారసుడిని సంతోషంగా పంపిస్తున్నా'

'నా వారసుడిని సంతోషంగా పంపిస్తున్నా'

సుదీర్ఘ రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఈసారి తాను ఎన్నికల బరిలోకి దిగడం లేదని తెలిపారు. నిన్న రాత్రి ఆయన అమరావతిలో మాట్లాడుతూ నా వారసుడు శ్యామ్‌ను సంతోషంగా రాజకీయాల్లోకి పంపిస్తున్నాని అన్నారు.1978లో చంద్రబాబునాయుడుతో కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించానని కృష్ణమూర్తి గుర్తు చేసుకున్నారు. ఇక.. నిన్న టీడీపీ విడుదల చేసిన మొదటి జాబితాలో పత్తికొండ అసెంబ్లీ స్థానాన్ని కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్‌కు ఖరారు చేశారు.