గుడ్‌న్యూస్‌.. కోలుకున్న కేదార్‌ జాదవ్‌ 

గుడ్‌న్యూస్‌.. కోలుకున్న కేదార్‌ జాదవ్‌ 

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. గాయంతో ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ కోలుకున్నాడు. జాదవ్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించిన టీమిండియా ఫిజియో పాట్రిక్‌... అతను ఫుల్లీ ఫిట్‌ అని ప్రకటించాడు. ఈక్రమంలో ఈనెల 22వ తేదీన జట్టు సభ్యులతో కలిసి జాదవ్‌ కూడా ఇంగ్లండ్‌ బయలుదేరుతాడు. ఒకవేళ మే 22వ తేదీ నాటికి జాదవ్‌ కోలుకోకపోతే అంబటి రాయుడు లేదా అక్షర్‌ పటేల్‌కు ఛాన్స్‌ వస్తుందని భావించారు.