మరోసారి క్రిష్ సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్

మరోసారి  క్రిష్ సినిమాకు ఆ  మ్యూజిక్ డైరెక్టర్

చిరంజీవి మేనల్లుడు, హీరో సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ తొలిచిత్రం 'ఉప్పెన'. అది ఇంకా విడుదల కాకుండానే మరో సినిమాలో నటించడానికి అతనికి అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయికగా రకుల్ ని ఎంచుకున్నారు.మరోపక్క, పవన్ కల్యాణ్ తో తాను చేస్తున్న భారీ చిత్రానికి బ్రేక్ రావడంతో, ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో ఓ చిన్న సినిమా చేయాలని క్రిష్ ప్లాన్ చేశాడు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన 'వేదం', 'యన్‌.టి.ఆర్‌' బయోపిక్‌ రెండు భాగాలకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ప్రస్తుతం వికారాబాద్‌ అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. సినిమా అంతా అటవీ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ చేస్తున్న చిత్రానికీ కీరవాణి సంగీతం అందిస్తారని వినికిడి.