'మహానటి'లో భాగమైనందుకు గర్వంగా ఉంది..

'మహానటి'లో భాగమైనందుకు గర్వంగా ఉంది..

యాంకర్:  తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ ఓ గొప్ప సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా మనకు అందించబోతుంది. అదే 'మహానటి' సినిమా. ఈ సినిమాలో నటించిన ఇద్దరు గొప్ప నటీమణులతో మన మాట్లాడుకుందాం. మహానటిగా మెరిపించబోతున్న కీర్తి సురేశ్, మధురవాణిగా కనిపించబోతున్న సమంత. ఇద్దరకు కంగ్రాచ్యులేషన్స్.. 
కీర్తి సురేశ్, సమంత: థ్యాంక్య్ అండి 
యాంకర్ : ఓ ప్రేక్షకురాలిగా... పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఓ గొప్ప సినిమా చూడబోతున్నందుకు. మీకెలా అనిపిస్తుంది సమంత గారు. మీరు మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా మహానటి నుంచి ఏం కోరుకొని మీరు ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.? 
సమంత: కథ విన్న తర్వాత నేను నటిగా ఈ సినిమాలో భాగమైతే బాగుండు అనుకున్నాను. అదీ... గొప్ప నటీమణి, లెజండరీ యాక్ట్రెస్ సావిత్రగారి జీవితం అయినందుకు చాలా గర్వంగా ఉంది. చాలా మంది గొప్ప నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నారు. 
యాంకర్ : మహానటి అని టైటిల్ వినగానే ఓ భయం ఉంటుందేమో లోపల. అది మీరు ఎలా అధిగమించారు? 
కీర్తి సురేశ్ : నాగి ఆ విషయం చెప్పినప్పుడు వెంటనే నో అన్నాను. ఆ తర్వాత చాలా గట్టిగా పట్టుబట్టి మరీ నన్ను ఒప్పించారు. నిర్మాతలు అంతా చెప్పడంతో ఇక ఒప్పుకున్నాను. ఇక అంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు భయంతోనే నేర్చుకొని చేశాను. సావిత్రిగారి లైఫ్ ఎత్తుపల్లాలు అన్నింటినీ తెలుసుకున్నాను. ఫీలయ్యేలా నటించాను.  
యాంకర్ : అస్సలు 50శాతం ఫస్ట్ లుక్ తోనే వచ్చేసింది. ఈమె మనకు తెలిసిన కీర్తినేనా అనేంత డౌట్ వచ్చేసింది అందరికీ మీకెలా అనిపించింది? 
సమంత : షూటింగ్ జరిగేప్పుడు నేను చూశాను. సావిత్రి గారి పోస్టులు.. కీర్తిగారివి.. మొదట నేనే చూశాను. అప్పుడు ఇద్దరి పోలికలో నేనే గుర్తు పట్టలేక పోయాను. ఏది ఒరిజనల్.. ఏది ఇప్పుడు క్రియేట్ చేసింది అని తెలుసుకోలేకపోయాను. మేకప్, లుక్, స్టైలింగ్, జ్యూయలరీ.. అందరూ అంత ప్రాణం పోశారు కాబట్టి అంతలా వచ్చింది. ఇంత కష్టమున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. 
యాంకర్ : సెట్స్ కూడా... కాస్ట్యూమ్స్, అండ్ జ్యూయలరీ క్యారెక్టర్ ను రీక్రియేట్ చేస్తున్నప్పుడు అంత ఎఫర్ట్ పెడతారు.. ఓకే.. సెట్స్.. అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఎఫర్ట్ పెట్టడం గ్రేట్ అనిపిస్తుంది? 
కీర్తి సురేశ్ : నిజంగా ఎంతో మంది కష్టం అందులో ఉంది. లుక్ కోసం కాస్ట్యూమ్స్ జ్యూయలరీ ఓకే.. కానీ... లైటింగ్.. సెట్... ఆర్ట్.. చుట్టూ ఉన్న ప్రజలు వారి కాస్ట్యూమ్స్.. ఇలా ఎన్నో విషయాలు కలగలిసే అంత గొప్పగా చేయగలిగాం. 
యాంకర్ : సినిమాలో నిజంగా విజయావాహిని స్టూడియోస్ ని చూసినట్టే ఉంది. రంగస్థలంలో మీరు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది.? 
సమంత : ఇప్పుడున్న మోడ్రన్ కాలాన్ని బ్లాక్ అండ్ కాలంనాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయడం చాలా కష్టం. ఇందులో సినిమాటోగ్రాఫర్ డానీ అద్భుతమైన వర్క్ చేశారు. అంతటి ఎఫర్ట్ సాధించడానికి.  ఇతడు ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్.  
యాంకర్ : కీర్తిగారు మీరు ఆడియో రిలీజింగ్ లో 'నేను మహానటి పాత్ర పోషిస్తే... ఈ సినిమాకు నిజమైన స్టార్ సమంత' అన్నారు ఏమిటి అందులో మర్మం.? 
సమంత : అలా ఎందుకు చెప్పారో నాకు తెలియదు. అది ఖచ్ఛితంగా కాదు. 
కీర్తి సురేశ్ : అది నిజమే నేను అన్నది. సమంతనే ఈ సినిమా స్టార్. ఈ పాత్రను నడపించింది సమంతనే. 
సమంత: నాకు లభించిన ఒక గొప్ప గోల్డెన్ చాన్స్ అని భావిస్తున్నా.. ఎందుకంటే లక్షల మంది అభిమానులను కలిగి ఉన్న.. ఆరాధించే సావిత్రిగారి బయోపిక్ చేయడం నాకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. 
యాంకర్ : నాగ్ అశ్విన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది.. ఏమైన సమస్యలు ఎదుర్కున్నారా? 
కీర్తి సురేశ్: ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. నాగి చాలా నెమ్మదస్తుడు. ఓపిక, సహనం ఉన్న డైరెక్టర్. అంతకు మించి కాన్ఫిడెంట్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తి. 
సమంత : నాగ్ అశ్విన్ చూడటానికి బాయ్ లా ఉంటాడు. కానీ... చాలా బలమైన నమ్మకమైన.. విజన్ ఉన్న డైరెక్టర్. అతనికి చాలా మంచిగా క్యారెక్టర్ నుండి రాబట్టుకునే.. విషయాన్ని పిండుకునే తెలివి ఉంది. 
యాంకర్ : ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం నుండి అంతా ఎక్కువ శాతం వుమెన్స్ తో నిండిఉన్నట్లుగా తెలుస్తోంది. వుమెన్ పవర్ ఇందులోఉందని అంటున్నారు నిజమేనా? 
కీర్తి సురేశ్:  నిర్మామంలో ఇద్దరు అమ్మాయిలు, తెరపై కనిపించేది ఇద్దరు అమ్మాయిలు, వెనకాల బోలెడంతమంది అమ్మాయిలు ఉన్నారు. తెర వెనుక కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో అమ్మాయిలు ఉన్నారు. నిజంగా స్వప్న, ప్రియాంకగారు చాలా ప్యాషన్ తో చేశారు. మనీ కోసం కాకుండా చాలా హార్ట్ కు క్లోజ్ అయిన ప్రాజెక్ట్ గా అనుకొని చేశారు. వాళ్లు ప్రతి విషయంలో వారి ఇన్వాల్స్ మెంట్ ఉంటుంది. అన్నీ దగ్గరుండి స్వయంగా చూసుకున్నారు. నేను మహానటి షూటింగ్ సమయంలో నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అన్నీచోట్లా మగవారే ఉండేవారు.. కానీ ఇక్కడికి వచ్చేసరి అమ్మాయిలు చుట్టూతా ఉండటంతో చాలా ఆనందం వేసేది. 
యాంకర్ : ప్రత్యేకంగా వుమెన్స్ కు ఈ సినిమా ఏ సారాంశం ఎలాంటి భావాన్ని కలిగిస్తుందని మీరు భావిస్తున్నారు? 
సమంత : ఈ సినిమా నిజంగా ఓ పెద్ద మానసిక వికాసాన్ని తెస్తుంది. భారీస్థాయిలో తగిన సంచలనం రేపుతుంది. ఈ ప్రాజెక్ట్ అసలు ఇండస్ట్రీలో ఓ భాగం. కాబట్టి నిజంగా గర్వంగా భావించేలా సినిమా ఉంటుంది. 
యాంకర్ : కోయాక్టర్ గా దుల్కర్ తో నటన మీకు ఎలాంటి అనుభవాన్నిచ్చింది. 
కీర్తి సురేశ్ : దుల్కర్ తో నటన చాలా కూల్.. థ్రిల్ గా ఉంటుంది. 
సమంత : దుల్కర్ ఈ సినిమాలో భాగం కావడం చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే.. ఒకరకంగా ప్రతి ఒక్కరిలో ఉండే ఒకానొక స్వభావాన్ని ప్రతిఫలించే క్యారెక్టర్ అది. మనుషులు పరిస్థితుల ప్రభావంతో చెడు చేయవచ్చు కానీ... మనుషులు చెడు కాదు అనేది అతను కొన్ని సీన్స్ లో చాలా బ్రిలియంట్ ప్రదర్శన చేశాడు. ప్రతి అమ్మాయి అతన్ని లవ్ చేసింది. అందుకే దుల్కర్ ఈ క్యారెక్టర్ కి రైట్ సూటబుల్ పర్సన్.  
యాంకర్ : విజయ దేవరకొండ ఈ సినిమాలో ఎలా నటించారు. ఎలా అనిపించింది..? 
సమంత : చాలా మంచి ఎక్స్ పీరియన్స్. అతను చాలా నేచురల్ గా ఉంటాడు. ఓపన్ మైండ్ చాలా సరదాగా చేస్తాడు. గుడ్ యాక్టర్   విజయ్
యాంకర్ : మహానటిని ఎలాంటి ఆడియన్స్ ఇష్టపడాలి, ఈ తరం ప్రేక్షకులు, ఆమెను ఎరిగిన వారు, రాబోవు తరం వారికి ఈ సినిమాలో ముఖ్యంగా ఇప్పటితరం నటీనటులు, ఆ తరం నటీనటులతో పోల్చుకొని ఎలా చూడాలి? 
సమంత: మధురవాణి అనే నా క్యారెక్టర్ ముఖ్యంగా ఈ తరం యంగ్ జనరేషన్ ను దిక్సూచిలా నిలుస్తుంది. సావిత్రి ఎప్పుడూ..ఎప్పటికీ సావిత్రినే.. ఆమెను బీట్ ఎవరూ చేయలేరు. ఇక్కడ జర్నలిస్ట్ గా నా పాత్ర ఎలా ఉంటుంది అనే చూడాలి. 
కీర్తి సురేశ్ : ఈ సినిమా సావిత్రి బయోపిక్. ఓల్డ్ మూవీస్.. చెందిన కథ అనే భావాన్ని తొలగించి ఇది ప్రతి ఒక్కరికీ.. ప్రస్తత సమాజానికి కూడా కనెక్టై నడిచే కథలా చూసుకోండి. అద్భుతమైన సినిమాగా ఫీలవుతారు.  
యాంకర్ : తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే ఓ సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నామని తెలిపారు. అందుకు మీకు అభినందనలు అంటూ తెలిపారు. ఇంకా మహానటి సావిత్రి బయోపిక్ లో కీ రోల్స్ పోషించిన కీర్తి సురేశ్, సమంత ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే క్రింది వీడియోను క్లిక్ చేయండి.