సొంత ఊరికి కీర్తి సురేష్ భారీ సహాయం !

 సొంత ఊరికి కీర్తి సురేష్ భారీ సహాయం !

ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి కీర్తి సురేష్ సొంత ప్రాంతం కేరళ.  ప్రస్తుతం ఆ రాష్ట్రం వరదల్లో చిక్కుకొని విలవిలాడుతుండటంతో కీర్తి సురేష్ ఆ ప్రాంతానికి తన  అందజేశారు.  

కేరళ సిఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షలు విరాళమిచ్చిన ఆమె ఇంకో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టలు, మెడిసిన్స్, నిత్యావసర వస్తువుల్ని స్వయంగా కేరళ వెళ్లి బాధితులకు అందజేయనున్నారు.  స్టార్ గా ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత ప్రాంతాన్ని మర్చిపోని కీర్తి సురేష్ ను అభినందించాల్సిందే.