అప్పుడు ఇలియానా.. ఇప్పుడు కీర్తి..!!

అప్పుడు ఇలియానా.. ఇప్పుడు కీర్తి..!!

టాలీవుడ్ లో మహానటికి ముందు కీర్తి సురేష్ ,మంచి సినిమాలే చేసింది.  మంచి అవకాశాలు కూడా దక్కించుకుంది.  మహానటి తరువాత సౌత్ లో సినిమాలు చేయడం తగ్గించేసింది.  తమిళంలో ఒకటి, తెలుగులో మరొకటి సినిమా చేస్తున్నది.  ఇప్పుడు ఆమె చూపులన్నీ కూడా బాలీవుడ్ మీదనే ఉన్నాయి.  

బాలీవుడ్ లో బోనికపూర్ ఈ హీరోయిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.  దానికోసం కీర్తి ముంబైలో ఉంటూ... బాలీవుడ్ కు తగ్గట్టుగా తన షేపులు మార్చుకుంది.  గుర్తుపట్టలేనంత సన్నగా మారింది.  ఇదంతా ఎందుకు సౌత్ లో మంచి ఆఫర్లు ఉన్నాయి కదా అంటే వినడం లేదు.  అప్పట్లో ఇలియానా కూడా అంతే.  సౌత్ లో మంచి పొజిషన్లో ఉండగా బాలీవుడ్ వైపు గాలి మళ్లింది.  వెంటనే అక్కడికి చెక్కేసింది.  అక్కడ ఎన్ని సినిమాలు చేసినా పాపం సక్సెస్ కాలేకపోయింది ఇలియానా.