లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్...

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్...

'మహానటి' మూవీతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేష్ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. ఎవరైనా సూపర్ స్టార్ రజనీకాంత్‌ పక్కన ఒక్క సారి నటిస్తే చాలని భావిస్తున్నారు.. ఇప్పుడా అవకాశం కీర్తికి దక్కింది. రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమాలో కీర్తి సురేష్ నటించబోతోందంటూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపించాయి... ఇప్పుడు అదే నిజమైంది.. తాజాగా దీనిపై ఆఫీషియల్‌గా ప్రకటన వచ్చింది. చిత్ర యూనిట్‌తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. "ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. రజినీ సార్‌ని కలవడమే పెద్ద విషయం... కానీ, అయనతో కలిసి నటించడం నా జీవితంలో మరిచిపోలేనంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది కీర్తి.