సమ్మర్ మూడ్ లోకి కీర్తి సురేష్

సమ్మర్ మూడ్ లోకి కీర్తి సురేష్

మ‌హాన‌టి చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అందాల న‌టి కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగులో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి’ అనే చిత్రాలు చేస్తుండ‌గా, పలు తమిళ సినిమాలోనూ నటిస్తోంది. నితిన్‌కు జోడిగా నటించిన ‘రంగ్ దే’ సినిమా ఈ నెల 26న విడుదల అవుతుండగా, కీర్తి సురేష్‌ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘గుడ్ లక్ సఖి’ జూన్ 3న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో విడుద‌ల కానుంది. సూపర్ స్టార్ మహేష్ తో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది. కాగా కీర్తి సురేష్ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా గ్లామరస్ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. సమ్మర్ మూడ్ అంటూ కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.