కీర్తి సురేష్ సినిమాకు మణిరత్నం టైటిల్

కీర్తి సురేష్ సినిమాకు మణిరత్నం టైటిల్

2000 సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  స్టోరీ తో పాటు సాంగ్స్ కూడా సూపర్బ్ గా ఉండటం విశేషం.  ఈ సినిమా టైటిల్ తో ఇప్పుడు మరో సినిమా రాబోతున్నది.  అది తెలుగులో.  మహానటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్... మెయిన్ రోల్ చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  

ఈ సినిమా ద్వారా నరేంద్ర అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ లో వివిధ లొకేషన్స్ లో జరుగుతున్నది.  మహిళలపై జరుగుతున్న దాడులను ఆధారంగా చేసుకొని సినిమాను తీస్తున్నారు.  చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కీర్తి తో పాటు నదియా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.