బాలీవుడ్ హీరోతో కీర్తి సురేష్ !

బాలీవుడ్ హీరోతో కీర్తి సురేష్ !

 

అటు తమిళం, ఇటు తెలుగు రెండు భాషల సినిమాలతో బిజీగా ఉంది కీర్తి సురేష్.  ఇలాంటి బిజీ సమయంలోనే హిందీ పరిశ్రమలోకి అడుగిడుతోంది.  స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న సినిమాలో ఈమె కథానాయకిగా నటించనుంది.  ఈ చిత్రాన్ని అమిత్ శర్మ డైరెక్ట్ చేయనున్నాడు.  ఇండియన్ ఫుట్ బాల్ ప్లేయర్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.  ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నారు.  ఈ చిత్రం పట్ల కీర్తి చాలా ఆసక్తిగా ఉందట.  ఈ సినిమా ఆమెకు బాలీవుడ్ పరిశ్రమలో పాజిటివ్ ఫలితాన్నిస్తుందని ఆశిద్దాం.