క్రేజీ ఫోటో షేర్ చేసిన కీర్తి సురేష్

క్రేజీ ఫోటో షేర్ చేసిన కీర్తి సురేష్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌దే’. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి. ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ రంగ్ దే  సినిమా నుంచి ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ‘చెడు చూడకు, వినకు, మాట్లాడకు’ అంటూ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, కథానాయిక కీర్తి సురేష్‌, కథానాయకుడు నితిన్‌లు తెలుపుతున్న ఫోటో షేర్ చేసింది. లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రంగ్‌దే’ మార్చి 26న విడుదల కానుంది. అలాగే నితిన్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్, ప్రియాంక జవల్కార్ న‌టించిన ‘చెక్’ చిత్రం ఫిబ్ర‌వరి ‌26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.